రాజగోపాల్ రెడ్డి మరో లగడపాటి కాబోతున్నారా? - MicTv.in - Telugu News
mictv telugu

రాజగోపాల్ రెడ్డి మరో లగడపాటి కాబోతున్నారా?

November 6, 2022

సవాల్ రేపిన సెగ

బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి మరో లగడపాటి రాజగోపాల్ కాబోతున్నారా? మునుగోడులో కేసీఆర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు.?ఆ సవాల్‌కు కట్టుబడి ఉంటారా? లేదా ఫ్లోలో అలా మాట్లాడేశా…అని తప్పించుకుంటారా?ఇప్పుడీ సవాల్ పై పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

సవాల్ ఇదే

మునుగోడులో కేసీఆర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “మునుగోడులో బీజేపీయే గెలుస్తుంది. కేసీఆర్ అస్సలు గెలవరు.కేసీఆర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్లిపోతా” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ రిజల్ట్ రోజు మళ్లీ మళ్లీ వేస్తామని యాంకరమ్మ అంది. దానికి రాజగోపాల్ సమాధానమిస్తూ మాటంటే మాటే తగ్గేదేలే అంటూ వెళ్లారు.

ఇప్పుడు ఏం చేస్తారో…
ఇప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. 2,3 రౌండ్లలో గట్టిపోటీనిచ్చినా..చివరి రౌండ్ వరకు కారు జోరు సాగింది. 10 వేలకు పైగా మెజారిటీ టీఆర్ఎస్‌కు వచ్చింది. మరి మాటకు కట్టుబడి ఉంటారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఇలా మాట్లాడటం మామూలేనని, అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

అప్పట్లో లగడపాటి

 

లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు ముందు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అందరితో కలిసి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.ఏపీ విభజన తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో టీడీపీదే విజయమని సర్వేలు చేసి మరి చెప్పారు. సర్వేలు నిజం కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.తీరా ఈ సర్వేలు తుస్సుమన్నాయి. అన్నట్లే లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన బాటలో వెళ్తారా,లేదా అని సర్వత్రా చర్చ నడుస్తోంది.

మునుగోడు తీర్పు, బీజేపీ, ఓటమి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సవాల్ , లగడపాటి