Komatireddy Venkat Reddy explanation to congress show cause notice munugodu election
mictv telugu

కోమటిరెడ్డి ఆ ఆడియోపై ఇచ్చేశాడుగా ‘క్లారిటీ’..

November 5, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో హైలెట్‌గా నిలిచిన వివాదాస్పద ఆడియోపై వివరణ వచ్చేసింది. ‘తూచ్.. ఆ ఆడియో నాది కాదు,’ అంటూ భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ అధిష్టానికి చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తరపున బరిలోకి దిగిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఓ కాంగ్రెస్ నేతతో తను చెప్పినట్లు ప్రచారమైన ఆడియో తనది కాదని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనంటే గిట్టనివాళ్లు దాన్ని సృష్టించారని ఆయన చెప్పారట. ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లొచ్చిన వెంకట్ రెడ్డి పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు గడవులోగా సమాధానం ఇవ్వకపోవడంతో మళ్లీ నోటీసులు పంపారు. ఈ నెల 3న పోలింగ్ ఉండడంతో ఆయన ఆలస్యం చేసినట్లు సమాచారం.

రెండో నోటేసుకు స్పందించిన ఆయన, తనపై బురదజల్లేందకు నకిలీ వీడియో తయారు చేసి తనదిగా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని ఆడియోలో చెప్పిన వెంకట్ రెడ్డి తన తమ్ముడికే ఓటే వేయాలని కోరినట్లు ఆడియోలో ఉన్న సంగతి తెలిసిందే, ఓడిపోయే పార్టీకి ప్రచారం ఎందుకు చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.