భువనగిరికి కోమటిరెడ్డి పేరు ఖరారు.. వెనక్కి తగ్గిన మధుయాష్కీ - MicTv.in - Telugu News
mictv telugu

భువనగిరికి కోమటిరెడ్డి పేరు ఖరారు.. వెనక్కి తగ్గిన మధుయాష్కీ

March 16, 2019

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆయన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా తాను భువనగిరి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. దీనిపై అధిష్ఠానం ఇద్దరితో చర్చించిన అనంతరం.. భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటి‌రెడ్డి వెంకటరెడ్డి పేరునే ఖరారు చేసింది.

Komatireddy Venkat Reddy is the name of Congress candidate for Bhuvanagiri parliament

అధిష్ఠానం మధుయాష్కీ గౌడ్ ను బుజ్జగించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నల్గొండలో కోమటి రెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టు ఉండటంతో వెంకటరెడ్డి గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న కాంగ్రెస్ పెద్దలు కోమటి‌రెడ్డి పేరునే ఓకే చేసేశారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించే నేతలకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల తొలి జాబితాలో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును ప్రకటించనుంది.