తెలంగాణలో హంగ్ వస్తోంది.తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ కలుస్తాయంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పాటు సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై దృష్టిసారించింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో బుధవారం వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఇరువురి మధ్య సమావేశం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే కోమటిరెడ్డి మాత్రం థాక్రేతో సమావేశం అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాటిపై చర్చ జరగలేదు
అస్సలు థాక్రేతో నిన్నటి కామెంట్స్ పై చర్చజరగలేదని తెలిపారు . తన మాటలను మీడియా ఛానెళ్లు వక్రీకరించి తప్పుగా వేశాయని క్లారిటీ ఇచ్చారు. తన కామెంట్లను ఠాక్రేకు బోసురాజు వివరించారని తెలిపారు. పూర్తి వీడియో చూడకుండా సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారని కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఓసర్వే రిపోర్ట్ ప్రకారం నిన్న అలా మాట్లాడినట్టు స్పష్టం చేశారు. థాక్రేతో ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేదానిపై ప్రధానంగా చర్చించినట్టు కోమటిరెడ్డి తెలిపారు. ఈసారి ముందస్తుగా టికెట్లు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. గతంలో ఆలస్యంగా టికెట్ల అనౌన్స్ చేయడం వల్ల గోల్కొండ హోటల్లో గొడవలు జరిగాయని తెలిపారు. తెలుగు దేశంతో పొత్తు వద్దు అని సూచించినట్టు కోమట్టిరెడ్డి తెలిపారు. ఈనెల ఆఖరులో భువనగిరిలో పాదయాత్ర చేసినట్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండలో కూడా ఉత్తమ్ పాదయాత్ర చేస్తారని తెలిపారు. సర్కార్ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లామని కోమటిరెడ్డి వెల్లడించారు.
థాక్రే వార్నింగ్ ?
అయితే థాక్రే మాత్రం కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దని హెచ్చరించారని వార్తలు వస్తున్నాయి. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని థాక్రే చెప్పినట్లు సమాచారం. ఇక కోమటిరెడ్డి వివరణను థాక్రే హైకమాండ్‌కు పంపించనున్నట్టు తెలుస్తోంది.