కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట

March 19, 2018

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో పెద్ద ఊరట దొరికింది. వీరి శాసనసభ సభ్యత్వాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు కారణంగా నల్గొండ, అలంపూర్‌లకు నిర్వహించాల్సిన ఉప ఎన్నికల ప్రక్రియకు కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయంపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. 6 వారాలపాటు నోటిఫికేషన్‌ జారీ చేయొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గొడవ వీడియో ఫుటేజీని తమకు  సీల్డ్‌ కవర్లో సమర్పించాలంటూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. గవర్నర్ ప్రసంగానికి నిరసగా కోమటిరెడ్డి, సంపత్ నిరసన తెలపడం, కోమటిరెడ్డి విసిరిన హెడ్ సెట్ తగిలి శాసన మండలి చైర్మన్‌ కె. స్వామిగౌడ్‌ కంటి గాయమైందని అంటూ అసెంబ్లీ వారిద్దరి సభ్యుత్వాలను రద్దు చేయడం తెలిసిందే.