Komtireddy Rajagopal on joining bjp
mictv telugu

అదో చిల్లర గ్యాంగ్, 21న బీజేపీలో చేరుతున్నా.. రాజగోపాల్

August 6, 2022

‘‘టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హైకమాండ్ ఏ చర్యలు తీసుకుంది? అప్పుడెందుకు మాట్లాడలేదు? నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే, బీజేపీలోకి వెళ్తున్నాను. ఇది మోసమా?’ అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌లతో సమావేశమయ్యారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు. తాను ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నానని, చౌటుప్పల్‌లో బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటున్నానని వెల్లడించారు.

‘‘నాపైన, మా అన్నపైనా కాంగ్రెస్ నేతలు మతిలేని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి వెంకట్‌రెడ్డి. మాపై చిల్లర గ్యాంగ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఓ దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లింది. రేవంత్‌, అతని కోటరీ ఓ దొంగల ముఠా. రేవంత్ తన స్వార్థం కోసం, పదవుల కోసమే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్‌లో చేరాడు’ అని రాజగోపాల్ మండిపడ్డారు.