కొండపోచమ్మ కాలువకు గండి.. ఇళ్లలోకి నీళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

కొండపోచమ్మ కాలువకు గండి.. ఇళ్లలోకి నీళ్లు

June 30, 2020

Kondapochamm sagar canal break cm kcr farm house

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్‌ కాలవకు గండిపడింది. దీంతో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం గ్రామంలో భారీగా నీళ్లు వచ్చాయి. చాలా ఇల్లు జలమయం అయ్యాయి. చుట్టుపక్కల పంటపొలాలు నష్టం వాటిల్లింది. ఉదయం గండి పడటంతో బతికిపోయమని, రాత్రిపూట పడి ఉంటే ఊహించని నష్టం జరిగేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గండి విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై వెంటనే కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. ఇటీవలే రిజర్వాయరు నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు వదిలారు. కాగా, కొండపోచమ్మ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లే కాలువ పరిస్థితే ఇలా ఉంటే  ఇతర కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.