‘మోదీ జి.. సౌత్ పై చిన్న చూపు ఎందుకు?’..ఉపాసన - MicTv.in - Telugu News
mictv telugu

‘మోదీ జి.. సౌత్ పై చిన్న చూపు ఎందుకు?’..ఉపాసన

October 20, 2019

150వ గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. వాటిలో సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఒకటి. ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అందు కోసం సినిమా పరిశ్రమను ఎంచుకుంది. సినిమా నటీనటులకు కోట్లలో అభిమానులు ఉంటారు. వారు ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేస్తే ప్రజల్లోకి త్వరలో వెళుతుందని కేంద్రం భావిస్తోంది. 

ఇందుకోసం ఇటీవల బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని మోదీ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ గురించి ఆయన కల గురించి మోదీజీ వారితో చర్చించారు. ప్లాస్టిక్ నిషేధం గురించి వారికి వివరించాడు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేయాలని కోరాడు. అందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అన్నారు. ఈ అంశమై కొణిదెల ఉపాసన ట్విట్టర్ లో ప్రస్తావించారు. ఇదొక మంచి పరిణామం, సెలెబ్రిటీలను కలిసి వారిని కూడా దేశంలోని మంచి పనులలో భాగస్వామ్యం చేయడం గొప్ప విషయం. కానీ, ఈ కార్యక్రమంలో కేవలం బాలీవుడ్ సెలెబ్రిటీలను మాత్రమే భాగస్వాములను చేయడం బాధాకరంగా ఉంది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వైపు కూడా చూడండి. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయండని ఆమె ట్వీట్ చేశారు.