Koonanneni Sambasiva Rao elected as the CPI Telangana State Secretary
mictv telugu

టీసీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని.. పల్లాపై 14 ఓట్లతో గెలుపు

September 8, 2022

సీపీఐ పార్టీ తెలంగాణ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్‌లో ప్రత్యర్ధి పల్లా వెంకట రెడ్డిపై 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కూనంనేని గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేయగా, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు. ఈ ఓటంగ్‌కు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకగ్రీవం కావడానికి కీలక నేతలు ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ పట్టు వీడలేదు. చివరికి ఓటింగ్ నిర్వహించగా, కూనంనేనికి 59, పల్లా వెంకట రెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని గెలుపొందినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర కార్యదర్శిగా రెండు సార్లు పని చేసిన చాడ వెంకట రెడ్డి మూడోసారి కూడా తనకు అవకాశమివ్వమని కోరారు. అయితే తన ఎన్నిక మాత్రం ఏకగ్రీవం కావాలని పార్టీ శ్రేణులకు చెప్పగా, అటు కూనంనేని ఈ సారి తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో చాడ వెంకట రెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో పల్లా వెంకట రెడ్డి తెరపైకి రాగా, చివరకి ఓటింగ్ నిర్వహించక తప్పనిసరైంది.