Koosukuntla Prabhakar Reddy shakes hands with Komatireddy Rajagopal Reddy at Munugode by poll
mictv telugu

వారిద్దరి కరచాలనం.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర సన్నివేశం

November 6, 2022

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరో రెండు గంటల్లో తేలిపోనుంది. ముందుగా చెబుతున్నట్లుగానే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. లెక్కింపు ప్రారంభానికి ముందే ఆయా పార్టీల అభ్యర్థులు నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన జరిగింది. కుర్చీలో కూర్చొని ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వారిద్దరూ కరచాలనం చేసుకోవడం ఆసక్తికర సన్నివేశంగా మారింది.

కాగా.. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్లు పూర్తి కాగా.. టీఆర్ఎస్ వెయ్యికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది . మొత్తం 15 రౌండ్లు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.