Koosukuntla will take oath as MLA today
mictv telugu

ఎమ్మెల్యేగా నేడు కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

November 10, 2022

 

మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఉప ఎన్నిక తర్వాత TRS బలం అసెంబ్లీలో 105( ఒక ఆంగ్లో ఇండియన్‌తో కలిపి)కు చేరింది. మజ్లిసు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, BJPకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన సంగతి తెలిసిందే.