బ్రెడ్డు కాదు, ఆమ్లెటే.. చూసి తీరాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రెడ్డు కాదు, ఆమ్లెటే.. చూసి తీరాల్సిందే..

October 26, 2020

Korean street vendor makes giant omelette with 60 eggs

రోజు రోజుకి కొత్త కొత్త వంటకాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అలాగే ఆల్రెడీ ఉన్నవాటిలో చెఫ్స్ కొత్త పద్ధతులను సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి వంటకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరియాకు చెందిన ఓ స్ట్రీట్ ఫుడ్ చెఫ్ ఏకంగా 60 గుడ్లతో ఆమ్లెట్ వేసి అమ్ముతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ భారీ ఆమ్లెట్‌ని తయారు చేసి విధానం నెటిజన్లన ఎంతగానో ఆకట్టుకుంటోంది. చెఫ్‌ ఓ పెద్ద గిన్నె తీసుకుని అందులో 60 గుడ్లను పగులకొట్లి దానిలో వేస్తాడు. వాటిని బాగా కలుపుతాడు. 

తరువాత అందులోకి కావాల్సిన క్యారెట్‌, ఉల్లిపాయ, ఉల్లికాడల తరుగు, మాంసం ముక్కలను అందులో కలుపుతాడు. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మసలాలు వేసి బాగా కలుపుతాడు. ఇప్పుడు స్టవ్‌పై ఓ ప్యాన్ పెట్టి వేడి చేస్తాడు. అది వేడి అయిన తరువాత నూనె వేసి కలిపిపెట్టిన కోడిగుడ్డు మిశ్రమంలో కొంత అందులో వేస్తాడు. అది ఉడికిన తరువాత దాన్ని చుట్టి ప్యాన్‌లోనే పక్కన పెడతాడు. తరువాత ఇంకొంచెం గుడ్ల మిశ్రమాన్ని అందులో పోస్తాడు. అలా కొంచెం కొంచెం మిశ్రమాన్ని అందులో పోసి పెద్ద ఆమ్లెట్ చేస్తాడు. దాన్ని ఇటుకలాగా చుడతాడు. పూర్తిగా కాలాక దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ప్యాక్‌ చేస్తాడు. దాన్ని కంటైనర్‌లో ఉంచి అమ్మకానికి పెడతాడు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు భలే ఐడియా గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు.