రేవంత్ రెడ్డికి అనుచరుల షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ రెడ్డికి అనుచరుల షాక్

November 1, 2017

టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డి బాటలో మరికొందరు పయనిస్తున్నారు. అయితే ఆయన ధోరణి నచ్చక, కాంగ్రెస్‌లోకి వెళ్లలేక కొందరు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు.

రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌తోపాటు కోస్గి మండలానికి చెందిన రేవంత్ ముఖ్య అనుచరులు, కార్యకర్తలు బుధవారం గులాబీ తీర్థం పుచ్చుకుని షాకిచ్చారు. కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ సహా వందలాది మంది తెలంగాణ భవన్‌లో టీఆర్ ఎస్ నేతల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.  మరోపక్క.. న‌ల్గొండ టీడీపీ ముఖ్య నేత కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, ఆయ‌న సోద‌రులు, అనుచ‌రులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.