తెలంగాణ సీఎంగా కోట శ్రీనివాసరావు.. ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సీఎంగా కోట శ్రీనివాసరావు.. ఫస్ట్‌లుక్

July 10, 2020

Kota

తెలంగాణ ముఖ్యమంత్రిగా కోట శ్రీనివాసరావు.. అదేంటని అనుకుంటున్నారు కదూ. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాస రావు, ఇప్పుడు ఓ సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్. రామన్న చౌదరి పాత్రలో నటిస్తున్నారు. జులై 10న కోట శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా సదరు సినిమా యూనిట్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ‘రొరి’ అనే సినిమాలో కోట ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. 

ఇందులో చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు కోట శ్రీనివాసరావు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న ముఖ్యమంత్రి పాత్రను ఆర్‌. రామన్న చౌదరిగా పరిచయం చేశారు. సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ దర్శకత్వం వహిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.