వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వరుస కౌంటర్లు..ఎన్ కౌంటర్ లతో నెల్లూరు రాజకీయం వేడెక్కుతుంది. వైసీపీకి దూరం జరిగిన కోటం రెడ్డి ఇక ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు.ముందుగా చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోంశాఖకు కోటం రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని అమిత్ షాకు లేఖ రాశారు. ఫోట్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రభుత్వం భంగం కలిగించిందని..చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన కోటం రెడ్డి..త్వరలోనే అపాయింట్ మెంట్ దొరకగానే నేరుగా వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయునున్నట్లు స్పష్టం చేశాడు. బుధవారం మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు.
తనపై మంత్రులు, వైసీపీ నేతల చేస్తున్న విమర్శలపై కోటంరెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తనతో పాటు తన వైపు ఉన్నవారిపై కూడా కేసుల పెడుతున్నారని ధ్వజమెత్తారు. అయితే ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని కోటం రెడ్డి సవాల్ విసిరారు.అన్నింటికీ తెగించిన వాల్లే తన వైపు ఉన్నారని స్పష్టం చేశారు. దేనికి భయపడేది లేదని తెలిపారు.
నెల్లూరు రూరల్ లో రహదారులు, వాటర్ వర్స్క్ పై మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ పనులు ఆపేస్తే ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చిందని కోటంరెడ్డి చెప్పారు.నియోజక వర్గంలో రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, ధ్వంసమైన రహదారులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కేవలం రూ.10 కోట్లు విడుదల చేస్తే సరిపోతుందని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలోనే ఆందోళనకు దిగుతానని కోటంరెడ్డి హెచ్చరించారు.