‘గరుడవేగ’ కోసం అప్పిచ్చా.. 26 కోట్లు ఎగ్గొట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

‘గరుడవేగ’ కోసం అప్పిచ్చా.. 26 కోట్లు ఎగ్గొట్టారు

April 22, 2022

24

అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎగ్గొట్టారంటూ ప్రముఖ హీరో రాజశేఖర్ దంపతులపై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తనను దారుణంగా మోసం చేశారని, కేసు పెడితే నగరి కోర్టు ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వెల్లడించారు. ‘గరుడ వేగ సినిమా కోసం కావాలంటే అప్పుగా రూ. 26 కోట్లు ఇచ్చాను. ఇందుకోసం సంస్థ ఆస్తులను తాకట్టు పెట్టాను. ఆ డబ్బును బినామీ పేర్ల మీద మార్చుకొని దంపతులిద్దరూ నన్ను మోసం చేశారు. జీవితా రాజశేఖర్‌లపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది. ఈ కేసులో నగరి కోర్టు వారిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హీరో రాజశేఖర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయం’ అని కోటేశ్వరరాజు వ్యాఖ్యానించారు.