మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దేవాదాయ శాఖలో ఉన్న అవినీతి నిజమేనంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. ఇక నుంచి దేవాలయాల్లో సామాన్యులకే పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. వీఐపీల దర్శనాలను ఒకేసారి పూర్తిగా నిర్మూలించడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, మంత్రి దేవాదాయ శాఖ కార్యాయాన్ని విజయవాడలో ప్రారంభించారు.