‘తమిళ గద్దర్’ అరెస్ట్.. మోదీపై పాట ఎఫెక్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘తమిళ గద్దర్’ అరెస్ట్.. మోదీపై పాట ఎఫెక్ట్..

April 14, 2018

ప్రముఖ తమిళ ప్రజాగాయకుడు కోవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పళనిస్వామిలను దుమ్మెత్తిపోస్తూ పాట పాడినందుకు తిరుచ్చి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసమస్యలను పాటలు, నృత్యరూపకాల ద్వారా అందరి దృష్టికీ తీసుకొచ్చే కోవన్ తమిళ గద్దర్ అనే పేర్కొంది. గద్దర్ మాదిరే ఆయన కూడా వామపక్ష కార్యకర్త.

కోవన్.. ఇటీవల తమిళనాడుకు రామరాజ్య రథయాత్ర ప్రవేశించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ వీడియో పాటను రూపొందించారు. అందులో బీజేపీ, మోదీ, పన్నీర్ సెల్వం తదితరులను తీవ్రంగా విమర్శించారు. తమిళనాడు రైతులు,  ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ యాత్రేమిటని ప్రశ్నించారు. ఇషా పౌండేషన్‌ వ్యవస్థాకులు జగ్గి వాసుదేవ్‌ డ్యాన్స్ కూడా అందులో ఉంది. కోవన్ ప్రజలను రెచ్చగొడుతూ, నేతలను కించపరుస్తున్నారని తిరుచ్చికి చెందిన బిజేపీ నేత ఎన్‌.గౌతమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోవన్ గతంలోనూ చాలాసార్లు అరెస్టయ్యారు. జయలలితపై విమర్శలు సంధిస్తూ పాడిన పాటపై అరెస్టయ్యాడు.