అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓ కోవిడ్ వ్యాక్సిన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఆ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల అమెరికాలో 18 మిలియన్ల ప్రజలు అనార్యోగానికి గురైయ్యారని తెలిపింది. ” జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవటంతో అమెరికాలో 18 మిలియన్ల ప్రజలపై దుష్ప్రభావం చూపింది. ఈ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. వ్యాక్సిన్ అధీకృత వినియోగాన్ని పరిమితం చేయాలి” అని యూఎస్ ఎఫ్‌డీఏ సూచించింది.
మార్చి నాటికి ఫెడరల్ శాస్త్రవేత్తలు 60 దుష్ప్రభావాల కేసులను గుర్తించారని, అందులో 9 కేసులు ప్రాణాంతకమని పేర్కొంది. తక్కువ స్థాయి రక్త ప్లేట్లెట్లతో కలిపి అరుదైన, ప్రాణాంతక రక్తం గడ్డకట్టే సిండ్రోమ్ అయిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్ ప్రమాదం ఉందని నిర్ధారించింది. జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించిన తర్వాత, ఒకటి నుంచి రెండు వారాల్లోనే లక్షణాలు కనిపిస్తున్నాయని ఎఫ్‌డీఏ తెలిపింది.
మరోపక్క గత ఏడాది ఫిబ్రవరిలో అత్యవసర ఉపయోగం కోసం అమెరికా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కాలు వాపు, నిరంతర పొత్తికడుపు నొప్పి, తలనొప్పి లేదా అస్పష్టమైన దృష్టి వంటి నాడీ సంబంధిత లక్షణాలు, టీకా వేసిన ప్రదేశంలో చర్మం కింద పెటెచియా అని పిలిచే ఎర్రటి మచ్చలు ఏర్పడుతున్నాయని యూఎస్ శాస్త్రవేత్తలు గుర్తించారు.