మా తెలుగు టీవీ చానల్లో ప్రసారం అవుతున్న ‘‘కోయిలమ్మ’ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి, మహిళలపై దాడి చేసిన కేసులో అతనిపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి కోర్టు అతణ్ని రిమాండ్‌కు పంపింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు.
కేసు వివరాలు.. శ్రీవిద్య, అపర్ణ అనే యువతులు మణికొండలో బొటిక్ వ్యాపారం చేస్తున్నారు. వారితో కలసి వ్యాపారం చేసిన స్వాతి అనే యువతి ఇటీవల బిజినెస్ నుంచి తప్పుకరుంది. ఈ నేపథ్యంలో వివాదాలు మొదలయ్యాయి. సమీర్.. శ్రీవిద్య, అపర్ణల నుంచి 5 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. లావాదేవీలను తేల్చుకోడానికి సమీర్, స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లారు. నలుగురి మధ్య గొడవలు ముదిరాయి. అప్పటికే బాగా తాగి ఉన్న సమీర్.. శ్రీవిద్య, అపర్ణలను బండబూతులు తిట్టి బెదిరించాడు. తర్వాత శ్రీవిద్య, అపర్ణలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు స్వాతి, సమీర్‌లపై కేసు నమోదు చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని సీరియల్ హీరో తలబిరుసుతో అంటున్నాడు.