ప్రేమపెళ్లి చేసుకోడానికొస్తూ.. ఆ విమాన ప్రమాదంలో నుజ్జయి..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమపెళ్లి చేసుకోడానికొస్తూ.. ఆ విమాన ప్రమాదంలో నుజ్జయి.. 

August 10, 2020

Kozhikode Flight Incident  .

విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత గడ్డపైకి తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్‌లో భాగంగా విమానాలు ప్రాయాణికులను తీసుకువస్తున్నాయి. అయితే కేరళలోని కోజికోడ్‌లో ఇటీవల  జరిగిన విమానం ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. చాలా రోజుల తర్వాత భారత్ గడ్డపై అడుగు పెట్టబోతున్నామనే వారి సంతోషాన్ని ఆవిరి చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మరణించారు. ఇందులో ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అతని కుటుంబంలో తీరని విషాదాన్నినింపింది.

మహమ్మద్ రియాస్ అనే యువకుడు తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో హరియానాకు చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లాడు. ఇంట్లో ప్రేమ వ్యవహారం  గురించి చెప్పి పెద్దలను ఒప్పించడంతో పెళ్లికి ఏర్పాటు చేశారు. గతంలోనే ఇది జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా అతడు దుబాయ్‌లోనే చిక్కుకోవడంతో వాయిదా పడింది. వందే భారత్ విమానంలో టికెట్ దొరకడంతో తన పెళ్లి కోసం ఎంతో సంతోషంగా తమ్ముడు నిజాముద్దీన్‌తో కలిసి బయలుదేరాడు. తీరా ఆ ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిజామూద్దీన్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని వస్తున్న అతని ఆశలు ఆవిరైపోయాయి.