ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో మంత్రి బంధువు స్కాం : డీకే - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో మంత్రి బంధువు స్కాం : డీకే

May 2, 2022

కర్ణాటకలో జరిగిన పోలీస్ ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో విద్యాశాఖ మంత్రి బంధువు ఒకరు స్కాంకు పాల్పడ్డారని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అభ్యర్ధుల నుంచి బంధువుకు డబ్బు అందిందని, ఆ గ్రామంలో బహిరంగంగా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. డబ్బు కోసం అభ్యర్ధులు తమ ఆస్తులు అమ్ముకున్నారని వివరించారు. ఈ విషయంపై కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేస్తూ మంత్రి పేరు చెప్పవద్దని బతిమిలాడుతున్నారని చెప్పారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసింది. దీనిపై శివకుమార్ స్పందిస్తూ.. ‘స్కాంలో సొంత వ్యక్తులు ఉన్నందున, వారి పేర్లు బయటికి రాకుండా నియామకాలను రద్దు చేశారు. మీకు నీతి, నిజాయితీ ఉంటే సీఐడీ దర్యాప్తు చేయించండి. అంతేకానీ, వాయిదా వేసి నిజాయితీ గల వ్యక్తులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యానించారు.