కృష్ణా జిల్లాలో కలకలం.. బ్రిడ్జి కింద మూడు మృతదేహాలు - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణా జిల్లాలో కలకలం.. బ్రిడ్జి కింద మూడు మృతదేహాలు

October 5, 2020

Krishna district .. Three bodies under the bridge.

కృష్ణా జిల్లాలో బ్రిడ్జి కింద మూడు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.  విస్సన్నపేట శివారులో బ్రిడ్జి కింద చెట్ల పొదల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోమవారం ఉదయం బ్రిడ్జి కింద చెట్ల పొదల్లో మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. బ్రిడ్జి మీద ఒక ఆటో ఆగి ఉంది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని శవాలను పైకి తీసుకువచ్చారు. మృతులు ముగ్గురూ ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన సంచార జాతికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో పేళ్లురి చిన్నస్వామి (36), తిరుపతమ్మ (25)లను భార్యభర్తలుగా గుర్తించారు. మరో మృతురాలు మీనాక్షి (11)ని వారి కుమార్తెగా పోలీసులు గుర్తించారు. వీరు వీధుల్లో ప్లాస్టిక్ సామానులు అమ్ముకునే సంచార చిరు వ్యాపారులు అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది హత్యా, ఆత్మహత్యా అనే విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు రెడ్డిగూడెం మండలం మాధవరం శివారు మామిడి తోటలో చెప్పులు, ఇనుప రాడ్డు, రక్తం మరకలు ఉన్న ఆనవాళ్లు లభించాయని పోలీసులు వెల్లడించారు. మాధవరం తోటలో ముగ్గురిని హత్యలు చేసి ఎవరికీ అనుమానం రాకుండా విస్సన్నపేట కాలువ బ్రిడ్జ్ కింద పారేశారని తెలిపారు. ఆటోను కూడా ప్రమాదం జరిగినట్టు సంఘటనా స్థలం వద్ద నిలిపి ఉంచారు. అలా వారంతా ప్రమాదవశాత్తు చనిపోయారని.. ఎవరికీ ఏ అనుమానం రాదని భావించి ఇలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.