Home > Featured > శాంతించని కృష్ణమ్మ.. భారీగా వరద

శాంతించని కృష్ణమ్మ.. భారీగా వరద

Krishna Floods Continue..

కృష్ణా నది ఉగ్రరూపం ఇంకా తగ్గలేదు. నదిలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీలోకి సుమారు 8.21 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 315 ఇళ్లు నీటమునిగాయి. తొమ్మిది వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా వరకు పంట పొలాలు కృష్ణా వరదల్లో మునిగిపోయాయి. చంద్రబాబు ఉంటున్న ఇళ్లు మెట్ల దగ్గర ఇంకా వరద తగ్గలేదు. భారీ వాహనాల రాకపోకలను అధికారులు బ్యారేజీపై నుంచి అనుమతించడంలేదు. వరద ఉధ‌ృతిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Updated : 16 Aug 2019 9:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top