ఒకే వేదికపై సందడి చేయనున్న సమంత, చైతూ... - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే వేదికపై సందడి చేయనున్న సమంత, చైతూ…

August 27, 2017

టాలివుడ్ లో మోస్ట్ క్రేజీ లవబుల్ కపుల్ నాగచైతన్య, సమంత అక్టోబర్ 6న పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య, సమంత మూవీలతో బిజీగా ఉంటూనే, మరోవైపు పెళ్లి షాపింగ్ చేసుకుంటాన్నరని టాక్. కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరు టూర్లలో ఫుల్ బిజీగా ఉండేది. వారు దిగిన ఫోటోలు సషోల్ మీడియాలో వైరల్ అయ్యేవి. కానీ ఈ మధ్య అలాంటి సందర్బాలు చాలా తక్కువ, చేనేతకి సంబందించిన కార్యక్రమంలో జంటగా కనిపించిన సమంత, చైతూ మరోసారి ఓ వేడుకలో సందడి చేయనున్నట్టు సమాచారం.

కృష్ష ఆర్విముత్తు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న యుద్దం శరణం మూవీ సెప్టెంబర్ 8న విడుదల కానుంది. అయితే ఆగస్ట్ 27న వివేక్ సాగర్ రూపోందించిన పాటలను విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రోగ్రామ్ కి సమంత గెస్ట్ గా హాజర్ కానుందట. ఈ కార్యక్రమంలో సమంత నాగచైతన్య స్పెషల్ అట్రాక్షన్ గా మారనున్నారు. విక్టరీ వేంకటేష్, అఖిల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నరట సన్నిహితుల సమాచారం. యుద్దం శరణం మూవీ ఆడియో వేడుక హైదరబాద్ జె. ఆర్.సి కన్వేన్షన్ లో జరగనుంది.