తెలంగాణకు 28 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు 28 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు

March 14, 2019

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నది జలాల వాడకంపై సమస్యలు నేలఁగొన్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ట్రిబ్యునల్ కమిటీ భేటీ అయింది. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మే నెల వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో అధికారులు చర్చించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రానికి 28 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్టు బోర్డు నిర్ణయించింది.