జంట నగరాలకు సింగూరు నీళ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

జంట నగరాలకు సింగూరు నీళ్లు!

August 30, 2017

హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు త్రాగునీటిని అందిస్తున్న  కృష్ణా నదిలో నీటి కొరత నెలకొనే అవకాశం ఉన్నందున  ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సింగూరు జలాశయం నుంచి జంట నగరాలకు గునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను  ఆదేశించారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా గండిపేట్, ఉస్మాన్ సాగర్ లలో నీటి కొరత ఏర్పడగా కృష్ణా నది నుంచి నీటిని సరఫరాకు చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలకు ఆదేశించడం ముఖ్యమంత్రి పారదర్శక పాలనకు నిదర్శనం అన్నారు. నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని మంత్రి తలసాని కోరారు.