హీరో చెల్లెలి లిప్‌లాక్.. బోల్డ్ అండ్ ఫ్రాంక్ - MicTv.in - Telugu News
mictv telugu

హీరో చెల్లెలి లిప్‌లాక్.. బోల్డ్ అండ్ ఫ్రాంక్

February 28, 2020

Krishna Shroff.

బాలీవుడ్‌ యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ తన ప్రియుడికి లిప్ టు లిప్ ముద్దు పెట్టుకున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 26 ఏళ్ల కృష్ణ ష్రాఫ్.. ప్రస్తుతం తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రొమాంటిక్ వెకేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను కృష్ణ సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కృష్ణ గతంలో కూడా ఎబాన్ హ్యామ్స్‌తో కలిసి ఉన్న రొమాంటిక్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆమె సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిమానులతో పంచుకుంటారు. తన కుంటుంబమంతా సినిమా రంగంలో సెటిల్‌ అవ్వగా.. కృష్ణ మాత్రం ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు.