క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన `రంగమార్తాండ` రిలీజ్ కి రెడీ అయింది. మరో 5 రోజుల్లో సినిమా విడుదల అవబోతోంది. ఇప్పటికే సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వస్తోంది. స్సెషల్ షో కి ప్రశంసలు దక్కుతున్నాయి. వంశీ మరోసారి ఎమోషనల్ గా టచ్ చేసారంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. వంశీ ఈజ్ బ్యాక్ అని రంగమార్తాండ సినిమా నిరూపిస్తుందని టాక్ నడుస్తోంది. సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు చేశారు. వీళ్ళు ముగ్గురూ యాక్టింగ్ చించేశారని అంటున్నారు. ఎప్పుడూ చూడని కొత్త నటనను చూస్తామని నమ్మకంగా చెబుతున్నారు.
తాజాగా రమ్యకృష్ణ పాత్రమీద కృష్ణవంశీ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను ఏడ్చేశానని చెప్పారు. రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగని భారీ డైలాగులు ఉండవు. చాలా సెటిల్డ్ పెర్పార్మెన్స్ లో కనిపిస్తుంది. క్లైమాక్స్ లోని ఒక సీన్ ను ఆమెపై షూట్ చేయడానికి చాలా ఇబ్బది పడ్డాను. నిజానికి ఆ సీన్ రాస్తున్నప్పుడే చాలా బాధ కలిగింది. ఎంతో హృద్యంగా అనిపించింది. కానీ ఆ సన్నివేశం సినిమా చాలా ముఖ్యం కాబట్టి అన్నింటిని తట్టుకుని రాసాను. ఇక ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఇంకెంత బాధపడ్డానో నాకే తెలుసు. కళ్ల వెంట కనీళ్లొస్తూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. ఒక రకంగా మనసును రాయిచేసుకునే షూట్ చేశాను` అని అన్నారు.
ఈ కథ నాటకరంగానికి చెందిన ఒక కళాకారుడి చుట్టూ తిరుగుతుంది అంటున్నారు కృష్ణవంశీ. నాటకం చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకి కలగాలి. అందువల్లనే ఎక్కడా క్రేన్ షాట్స్ – ట్రాలీ షాట్స్ – జిమ్మీ జిప్ షాట్స్ తీయలేదు. ఎమోషన్స్ కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కువగా టేక్ లు తీసుకున్నాను. పాత్రలన్నీ కూడా చాలా సజీవంగా కనిపిస్తూ ఉంటాయన్నారు.