Krishnam Raju's death..RGV's sensational comments
mictv telugu

కృష్ణంరాజు మృతి..ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

September 12, 2022

టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన మరణ వార్తను తెలుసుకున్న సినీ పెద్దలు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో వివాదస్పద డైరెక్టర్‌గా పేరుగాంచిన రాంగోపాల్ వర్శ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే, పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్‌లు ఆపుదామని ట్విటర్ వేదికగా కోరారు.

”మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. నేను కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్‌కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్‌కు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే..రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది” అని ట్వీట్ చేశారు.

 

అయితే, ఈ ట్విట్‌ను పోస్ట్ చేసే క్రమంలో ఆర్జీవీ..హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణం రాజు భౌతికకాయాన్ని కడసారిగా ఆయన దర్శించేందుకు సినిమా ఆర్టిస్టులు, అభిమానులు జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.