Krishna's body will be taken to Padmalaya studio tomorrow
mictv telugu

కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చిబౌలికి తరలించట్లేదు.. ఎందుకంటే

November 15, 2022

Krishna's body will be taken to Padmalaya studio tomorrow

గుండెపోటుతో మరణించిన సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహాన్ని మంగళవారం రాత్రి ఆయన స్వగృహం నానక్ రాంగూడలోని విజయకృష్ణలోనే ఉంచనున్నారు. ఈ మేరకు మహేశ్ బాబుకి చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకి తరలిస్తారు.

అక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానులకు నివాళులు అర్పించడానికి అనుమతిస్తారు. అనంతరం పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరుక అంతిమ యాత్ర మొదలవుతుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం మంగళవారం సాయంత్రం భౌతికకాయాన్ని అభిమానుల కోసం గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని అనుకున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తికాగా, అభిమానులు కూడా భారీగా స్టేడియానికి తరలివచ్చారు. కానీ, సూర్యాస్తమయం కావడంతో సెంటిమెంట్ ప్రకారం మృతదేహాన్ని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నేరుగా పద్మాలయా స్టూడియోకి తరలిస్తామని తెలిపారు. అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అటు ఇప్పటికే రాజకీయ, సినీ రంగ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం హైదరాబాద్ రానున్నారు.