Krishna's last rites concluded with official ceremonies
mictv telugu

అధికార లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు మధ్యాహ్నం 3.45 గంటలకు ముగిశాయి. జూబ్లీహిల్స్‌‌‌లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. ప్రభుత్వం అధికార లాంఛనాలు ఏర్పాటు చేసింది. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. అంతకుముందు పద్మాలయా స్టూడియో నుంచి అంతిమయాత్ర జరిగింది. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. చివరి క్షణాల్లో కృష్ణ క్లాస్ మేట్, నటుడు మురళీమోహన్, టీడీపీ నేత బుద్ధా వెంకన్నలు కృష్ణ పాడె మోశారు. కుటుంబ ఆచారం ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా నుదుటిన వైష్ణవ నామం పెట్టారు. కుమారుడు మహేశ్ బాబు తండ్రి చితికి నిప్పంటించారు.