అల్లూ మీద కమాల్ కీ ట్వీట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

అల్లూ మీద కమాల్ కీ ట్వీట్ !

July 4, 2017

అల్లూ మీద కమాల్ కీ ట్వీట్ !కమాల్ ఆర్ ఖాన్.. అలియాస్ కెఆర్కే.. ఈయన క్రిటికే కాదు గొప్ప విమర్శకుడు అని మనందరికి తెల్సిన ముచ్చటే. వర్మ ఒక టైపాఫ్ విమర్శకుడైతే ఈయనొక టైపాఫ్ విమర్శకుడు. బాలివుడ్ సినిమాలకు రివ్యూలు రాస్కోకుండా టాలీవుడ్ మీద ఎందుకు పడ్డాడూ ? అంటే విమర్శకుల పనే అది కదా.. ఎక్కడ ఏ వంక దొరుకుతుందా వెంటనే విమర్శించేద్దాం అనుకుంటారు.

అలా కెఆర్కే నోటి దూలకు, కలం గోకుడుకు ఈసారి అల్లు అర్జున్ పీస్ అయ్యాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లను వదలకుండా ఏకి పారేసాడుయ కేఆర్కే. ఇప్పుడు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో చాలా ఘాటుగానే ట్వీట్ చేసాడు. ‘ ఈరోజు నాకెవరో చెప్పారు ఈ లుక్కా లుకింగ్ ఆలు టాలీవుడ్ లో స్టార్ అని.. బ్రో నువ్వొకసారి బాలివుడ్ కి రా.. అక్కడ చిన్న చిన్న రోల్స్ చేస్కుందువు గానీ ’ అని ట్వీట్ చేసాడు.దీంతో చాలా మంది బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయి చెలరేగిపోతున్నారు.

అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు బాలీవుడ్ లోకి డబ్ అయి రిలీజౌతున్నాయి. యూట్యూబ్ లో పెద్ద హిట్లుగా నిలుస్తున్నాయి. అలాంటి మన అల్లు అర్జున్ ని అనడానికి అతనెవరు ? అన్న రేంజిలో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారట. కొంతమంది కెఆర్కె ట్వీట్ ను పాజిటివ్ గా తీస్కుంటున్నారు. క్యాష్, బ్యాగ్రౌండ్ వున్న ప్రతీ ఆల్చిప్ప మొహం వాడు హీరో అయిపోవడమేనా ? డబ్బు, బ్యాగ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ ఆ లెవల్లో హీరో అవగలడా ? అని కెఆర్కేకు మద్దతుగా మాట్లాడుతున్నారు కూడా. అవును గంగోత్రి సినిమా అప్పుడు అల్లు అర్జున్ ను చూసినవాళ్ళంతా ఇతనేం హీరోరా నాయనా అని తల బాదుకున్న ఆడియన్స్ చాలా మందే వున్నారు.అంతెందుకూ.. అప్పట్లో యాంకర్ అనసూయ కూడా అంది కదా ‘ గంగోత్రి ’ సినిమాలో అల్లు అర్జున్ హీరో అంటే నేను నమ్మలేకపోయాను.

అతను హీరోయేంటని ? చాలా ఓపన్ గానే చెప్పింది. అనసూయ వాఖ్యలు అప్పట్లో పెద్ద దూమారమే రేపి చివరికి తను సారీ చెప్పే వరకు పోయింది వ్యవహారం. ఇప్పుడు తాజాగా కెఆర్కే వచ్చాడు తెర మీదకు. చూడాలి మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కెఆర్కే చేత సారీ చెప్పిస్తారేమో !?

https://twitter.com/kamaalrkhan/status/881417902443954176