ప్రపంచంలో మరో మనిషే లేనట్లు తనను తాను పెళ్లి చేసుకున్న గుజరాత్ యువతి క్షమా బిందు వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రమ తనకు ప్రధానం అంటోంది. స్త్రీపురుషుల మధ్య జరిగే పెళ్లిళ్లు ఏమంత బాగాలేవని, మగవాళ్లు అనుకున్నట్లు ఉండడం లేదని ఆమె తాజా మాటామంతిలో చెప్పింది. క్షమ తనకు తాను తాళి కట్టుకుని, తనే పెళ్లి మంత్రాల చదువుకుని పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇదే తొలి స్వీయవివాహం. తను హనిమూన్ కోసం గోవాకు వెళ్తానని ఈ 24 ఏళ్ల భార్య కమ్ భర్త చెప్పింది.
‘పెళ్లి సరే, మరి తర్వాత జీవితం ఎలా అమ్మాయ్?’ అని పలువురు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జీవితంలో అత్యంత అవసరమైన సెక్స్ గురించి అడుగుతున్నారు. ఆమె కూడా తడుముకోకుండా జబర్దస్త్ జవాబు ఇచ్చింది. ‘ఆడవాళ్లను పెళ్లాడిన మగవాళ్లు సరిగ్గా ఉన్నారని నేను అనుకోవడం లేదు. సెక్స్ ఎవరికైనా అవసరమే. అయితే అది వ్యక్తిగత విషయం. మరొకరు ఇందులో తలదూర్చాల్సిన పనిలేదు. లైంగికంగా నేనెలా తృప్తి చెందుతానన్నది పూర్తిగా నా పర్సనల్ మేటర్.. ’ అని అంది క్షమ.