ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్.. 20 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్.. 20 మంది మృతి

February 20, 2020

bus

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ భారీ కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా మరో 23 మంది గాయపడ్డారు.  కోయంబత్తూరు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతం అంతా మృతదేహాలతో శవాల దిబ్బగా మారిపోయింది. క్షతగాత్రుల ఆర్తనాధాలు మిన్నంటాయి. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు బయలుదేరింది. దీంట్లో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అవినాశి వద్ద కంటైనర్ ఢీకొంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, 15 మంది పురుషులు ఉన్నారు.మృతుల్లో బస్సు కండక్టర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధితులకు సత్వర సాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. బాధితుల్లో చాలామంది త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.