బైకర్‌కు రూ. 10 వేల ఫైన్.. బస్సుకు సైడ్ ఇవ్వలేదని.. - MicTv.in - Telugu News
mictv telugu

బైకర్‌కు రూ. 10 వేల ఫైన్.. బస్సుకు సైడ్ ఇవ్వలేదని..

October 2, 2020

KSRTC Fine To Biker

బస్సు వస్తుంటే కొంత మంది పోకిరీలు దాని ముందు అడ్డంగా వెళ్తూ ఆటంకం కలిగించే ఘటనలు చూస్తూనే ఉంటాం. ఇలాగే ఓ వ్యక్తి చేసిన పనికి అధికారులు తగిన శిక్ష విధించారు. ముందు వెళ్తూ దారి ఇవ్వకపోవడంతో రూ. 10,500 జరిమానా విధించారు. సెప్టెంబర్ 26న కేరళలో ఇది జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగా అడ్డు తగులుతూ విసుగు తెప్పించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

కన్నూర్ నుంచి కాసరాగోడ్‌కు బస్సు వెళ్తుండగా ఓ వ్యక్తి పెరుంబా సమీపంలో బైకుపై అడ్డు వచ్చాడు. డ్రైవర్ తప్పుకోవాలని ఎంత హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు.  ఏ మాత్రం దారి ఇవ్వకుండా అటూ ఇటూ వెళ్తూ విసుగు తెప్పించాడు. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు అలాగే బస్సు ముందు వెళ్లాడు. కొంత సమయానికి బస్సు డ్రైవర్ ఎలాగోలా అతడిని తప్పించాడు. ఈ తతంగం అంతా బస్సులో ఉన్న ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో ఆర్టీసీ అధికారులు బైక్ నంబర్ ఆధారంగా ప్రవీణ్ అనే వ్యక్తిగా గుర్తించారు. వివరాలు సేకరించి జరిమానా విధించారు. విధులకు ఆటంకం కలిగించినందుకు చర్యలు చేపట్టారు.