ఫ్యూచర్ పర్ ఫెక్ట్ కేటీఆర్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్యూచర్ పర్ ఫెక్ట్ కేటీఆర్..!

July 24, 2017

ప్రభుత్వంలో మూడు సంవత్సరాల తన అనుభవాన్ని , కెటిఆర్ తో కలిపి వేసిన అడుగులను తన ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు దిలీప్ కొణతం.దానికి ఫ్యూచర్ పర్ ఫర్ ఫెక్ట్ హాష్  ట్యాగ్ ను పెట్టారు.తెలంగాణ ఉద్యమ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫాంపై  ఉద్యమాన్ని  నడిపించిన వ్యక్తుల్లో దిలీప్ ప్రముఖుడు.తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో శెరీకైన దిలీప్ కొణతం..తెలంగాణ డిజిటల్ మీడియాకు డైరెక్టర్ గా పనిని ప్రారంభించారు.గతంలో దిలీప్ చాలానే పుస్తకాలు రాసినప్పటికీ ప్రముఖంగా చెప్పుకోదగ్గ పుస్తకం “దళారి పశ్చాత్తాపం”,జాన్ పెరికిన్స్ సామ్రాజ్యవాదం కార్పోరేటీకరణపై రాసిన “ఎకనమిక్ హిట్ మ్యాన్” పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేసారు దిలీప్. కెటిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యూచర్ పర్ ఫెక్ట్ కెటిఆర్ అనే 81 పేజీల ఇంగ్లీషు పుస్తకాన్ని తాజ్ కృష్ణాలో ఆవిష్కరించారు. ఈకార్యక్రమానికి  ముఖ్యఅథితులుగా హైద్రబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, నమస్తే తెలంగాణ ఛీఫ్ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి,తెలంగాణ టుడే చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఈపుస్తక విషయానికస్తే  మొత్తం 81 పేజీల పుస్తకం,15 ఛాప్టర్లతో,ప్రతి పేజీకి ఒక ఆకర్షనీయమైన కెటిఆర్ ఫోటోతో “కాఫీటేబుల్” బుక్ లాగా ఉంది.