ktr and revanth reddy tweets war
mictv telugu

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్…

November 1, 2022

ktr and revanth reddy tweets war

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి..సార్వత్రికల ఎన్నికలకు ఇంకా ఎడాది సమయం ఉన్నా ఎన్నికల మూడ్ లోకి వచ్చేసాయి ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక, ఇదే సమయంలో రాహుల్ భారత్ జోడో యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది.పాదయాత్రలో భాగంగా రాహుల్ టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు.. సోమవారం రాహుల్ మాట్లాడుతూ టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి పొత్తు ఉండదని స్పష్టం చేశారు .టీఆర్ఎస్ ప్రజల సొమ్ము దోచుకుంటుందని విమర్శించారు..

రాహుల్‌కు కేటీఆర్ కౌంటర్

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సొంత నియోజకవర్గంలో గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవ చేసారు.. సీఎం కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ జాతీయ పార్టీ ఆశయాలను అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధానిగా కావాలని కలలుగంటున్న రాహుల్.. ముందుగా ప్రజలచే ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలి అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

కేటీఆర్ పై రేవంత్ ఫైర్

రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ లోనే ఆయను కేటీఆర్‌కు రీ కౌంటర్ ఇచ్చారు. కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని…మీరు డబ్బా కొట్టుకున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా ? ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ ? అంటూ రేవంత్ ట్వీట్ చేసారు..