Home > రాజకీయం > మున్సిపాలిటీలుగా పెద్దపల్లి,భూపాలపల్లి…

మున్సిపాలిటీలుగా పెద్దపల్లి,భూపాలపల్లి…


పెద్దపల్లి, భూపాలపల్లిని మున్సిపాలిటీలుగా మార్చుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం ఆయన మునిసిపల్‌ కమిషనర్లతో సమావేశమయ్యారు. ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, మనం చేయదగిన పనులే చేయాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అధికారులతో అన్నారు.

పట్టణాల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వ గ్యారంటీతో రూ.5వేల కోట్ల రుణాలు తీసుకుంటున్నామని, కొత్త జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ ఏర్పాటు కోసం రూ.5 నుంచి 10 లక్షల నిధులు కేటాయిస్తామని, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలను గౌరవించాలని సూచించారు. మునిసిపల్‌ సమావేశాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా కవరేజీ కోసం గొడవలు కాకుండా చర్చలు జరగాలని, వచ్చే ఏడాది 100 శాతం పన్ను వసూలు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

HACK:

  • KTR Annouonces Peddapalli, Bhupalapallil as Muncipalities.

Updated : 24 May 2018 4:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top