సామాన్యుడికి నరకయాతన.. సారీ చెప్పిన కేటీఆర్.. - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యుడికి నరకయాతన.. సారీ చెప్పిన కేటీఆర్..

April 12, 2018

తాను తప్పు చేసినా, తన వల్ల అనుకోకుండా తప్పు జరిగినా క్షమాపణ చెప్పడం సంస్కారం. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పారు. తనవల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు. మంత్రితో సారీ చెప్పిన ఈ ఘటన వివరాలు..

ఐదు రోజుల కిందట హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జితేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డుపై ఆ సమయంలో కేటీఆర్ వాహన శ్రేణి వెళ్తోంది. జితేందర్‌ను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో అతడు  20 నిమిషాలు రోడ్డుపై నరకయాతన అనుభవించాడు. మంత్రిగారి కాన్వాయ్ వెళ్లిపోయా స్పత్రికి వెళ్లాడు. ఈ అమానవీయ ఘటనపై ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.దీన్ని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ.. ‘ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను.. నా పనితీరు ఎప్పుడూ అలా ఉండదు. ఒకవేళ అది నిజమైతే ఆ జెంటిల్‌మెన్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలనిడీజీపీని కోరుతున్నాను.. ‘ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తాను మంత్రి అనే గర్వానికి పోకుండా సామాన్యుడికి క్షమాపణ చెప్పి పెద్దమనసు చాటుకున్నారని కితాబిస్తున్నారు.