కాకిని మెచ్చుకున్న కేటీఆర్

కాకి ఒకటి నీళ్లుకు కావు కావుమనెను.. కథ మనకు తెలిసిందే. దప్పికతో ఉన్న కాకి ఒక్కో రాయిని కుండలో వేసి నీళ్లు పైకొచ్చాక తాగి వెళ్లిపోతుంది కాకి. కాకులు చాలా తెలివైన ప్రాణులు. జపాన్ ప్రజల మాదిరే అక్కడి కాకులు మరింత తెలివైనవేమో మరి. ఈ వీడియో చూస్తే మీరూ ఒప్పుకుంటారు. బాగా ఆకలితో ఉన్న ఈ కాకికి ఓ కాయ దొరికింది. దాన్ని పగలగొట్టి లోపలున్న గింజ తినాలి. కాకికి ఆ శక్తి లేదు. అందుకే అదొక ఉపాయం ఆలోచించింది. అది నగరంలోకి కాకి. ట్రాఫిక్ రద్దీ మధ్య ఆ గింజను తినాలన్నది టార్గెట్.. అందుకు అదేం చేసిందో మీరే చూడండి..

ఈ కాకి ప్రదర్శించిన తెలివికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. దాన్ని మెచ్చుకుంటూ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతలో పోస్టు చేశారు.

SHARE