అమిత్ షాకు కేటీఆర్, ఏఆర్ రెహమాన్ కౌంటర్లు - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షాకు కేటీఆర్, ఏఆర్ రెహమాన్ కౌంటర్లు

April 9, 2022

fbfdbfdb

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాష గురించి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌లు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం పార్లమెంటరీ భాషా కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు పలకరించుకునేటప్పుడు ఇంగ్లీష్‌కు బదులు హిందీ భాష వాడాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేటీఆర్ ట్విట్టర్‌లో బదులిచ్చారు. ‘ప్రజలు ఏభాష మాట్లాడాలో మీరే నిర్ణయిస్తారా? ఏం తినాలో? ఏం వేసుకోవాలో? ఎవరిని ప్రార్థించాలో మీరే చెప్తారా? మనది వసుదైక కుటుంబ సమాజం. నా మాతృభాష తెలుగు. దేశంలో హిందీలో మాట్లాడి, ఇంగ్లీషును నిషేధించడం వంటివి యువత కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి’అని పేర్కొన్నారు. ఇదికాక, సంగీత దర్శకుడు రెహమాన్ కూడా స్పందించారు. ‘ప్రియమైన తమిళం’ అని కోట్ చేసి తమిళ దేవత ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాక, దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేసిన తమిళ జాతీయ గీతంలోని పదాలను ఉటంకించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ.. దేశ బహుళత్వ గుర్తింపును దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశ ఐక్యతకు అమిత్ షా వ్యాఖ్యలు భంగకరమని వ్యాఖ్యానించారు.