అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌కు కేటీఆర్ భూమిపూజ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌కు కేటీఆర్ భూమిపూజ

April 28, 2022

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించనుంది.  ఈ క్యాంపస్ నిర్మాణాానికి కేటీఆర్ గురువారం భూమిపూజ చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం, గూగుల్ సంస్థ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కార్యక్రమానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. క్యాంపస్ ద్వారా గూగుల్ పౌర సేవ‌లను, విద్య‌, ఇత‌ర రంగాల్లో ప్ర‌భుత్వానికి సాంకేతిక స‌హ‌కారాన్ని అందించ‌నున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ..”ఇప్ప‌టికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఈ ఒప్పందంతో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించే అవ‌కాశం ఏర్ప‌డింది. హైద‌రాబాద్‌లో గూగుల్ మూలాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డం సంతోషంగా ఉంది” అని అన్నారు. యువ‌త‌, మ‌హిళ‌ల, విద్యార్థుల, పౌర‌సేవ‌ల్లో మార్పు తీసుకురావ‌డంపై దృష్టి సాధించామని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ సంస్థ 2017 నుంచే తమ కార్యకలపాలను ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్తోంది.