కేటీఆర్ కొని తెచ్చుకున్న కొత్త పరేషాన్..! - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ కొని తెచ్చుకున్న కొత్త పరేషాన్..!

July 24, 2017

కేటీఆర్ ఇంటి నిండా..క్యాంప్ ఆఫీస్ నిండా గిఫ్ట్ లతో నిండిపోయాయట,అవి అసొంటి ఇసొంటి గిఫ్టులు కావు.. విలువైన బహుమతులు.నాపుట్టినరోజు నాడు…వచ్చి విషెస్ జెప్పిపోన్రి  అదే నాకు సంతోషం…అంతేగనీ,బుకేలు,పువ్వులు,బ్యానర్లు  కేకులని గిసొంటి పంచాదులేం పెట్టుకోకున్రి అని ముందే శెప్పిండు గదా కెటిఆర్ సారు.ఇగ సారు శెప్పింది వినకపోతే మంచిగుంటదా…అగో అందుకే అందరుగుడ సారు శెప్పినట్టే నడ్సుకున్నరు,కనీ  సార్ను కల్వనీకి ఉత్త శేతుల్తోని ఎట్లవోదుమని అన్కున్రో ఏమో…అందరు మన్షికో శెట్టు మొక్క పట్కపోయిన్రు,సారు పువ్వులైతె వద్దన్నడు గనీ శెట్ల మొక్కలు వద్దనలే గదా అని అన్కున్రు కావచ్చు,శిన్న మొక్కలా.. కల్శిపోయినోళ్లు శిన్నా మందా,వార్డు మెంబర్లనుంచి మొదలు వెడితే రాష్ట్రమంత్రులదాక,చప్రాసి నుంచి ఐపియస్ ఐఎఎస్ ఆఫీసర్ల దాక,ఆపీసర్ల సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు ఇట్ల శెప్పుకుంటవోతే  ఎంత రాసిన ఒడ్వది, అందరు సార్ను కల్శి పుట్టినరోజు శుభాకాంక్షలు శెప్పి మన్షికో  మొక్క శేతుల వెట్టిపొయ్యిన్రు,అయితే ఇది గాదు అస్సలు పర్శాన్, సారుకచ్చిన మొక్కలకు లెక్కవెట్టనీకి 10 మందిగుడ సరిపోతలేరట,గ మొక్కలను నాటుడు సారు ఒక్కడితోనైతె గాదు,మరి అవ్విట్ని  నర్సరీకి పంపిస్తరా…హరితహారంల మొక్కలు నాటున్రని అందర్కి పంచి పెడ్తరా  లేకపోతే  బొకేల పువ్వుల లెక్క ఎండిపోతయా…ఏమో కేటీఆర్ సారు ఆ మొక్కలనంటిని  ఏం జేస్తడో సూడాలె మరి.