Home > రాజకీయం > కలిసి పనిచేద్దాం..!

కలిసి పనిచేద్దాం..!

తెలంగాణలో కేటీఆర్..ఏపీలో లోకేష్ . ఇద్దరూ ముఖ్యమంత్రుల కుమారులు. అంతకుమించి యువనాయకులు..మంచి ఫ్యుచర్ఉన్న బ్రైట్ పొలిటికల్ స్టార్స్. ఇక కేటీఆర్ లో తెలంగాణలో తిరుగులేని యంగ్ లీడర్. ఈయనకు ఫాలోయింగ్ అలా ఉంటది మరి.ఎంత పక్క రాష్ట్రమైనా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్..కేటీఆర్ ను ప్రతి విషయంలో ఫాలో ఫాలో అంటుంటారు.

పైకి చెప్పకపోయినా ఆయన్నే రోల్ మోడల్. మంత్రి పదవి చేపట్టాక కేటీఆర్ దగ్గర ఉన్న శాఖల్నే..ఏపీ లో లోకేష్ తీసుకున్నారు. అలాంటి రోల్ మోడల్ బర్త్ డే వచ్చిందంటే చినబాబు ఊరుకుంటారా..అసలే ట్విట్టర్ లో యమ స్పీడ్…ట్విట్లు చేయనే చేశారు కేటీఆర్ కు. ఏమని అంటే.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్‌పై కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. లోకేష్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్.. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి పరస్పరం కలిసి పని చేద్దామని ట్వీట్ చేశారు కేటీఆర్.

Updated : 24 July 2017 2:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top