కేటీఆర్.. స్కాంగ్రెస్.. బొటానికల్ గార్డెన్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్.. స్కాంగ్రెస్.. బొటానికల్ గార్డెన్స్..

November 21, 2017

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్స్‌ వ్యవహారంపై ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌కు, ఓ కాంగ్రెస్ కార్యకర్తకు మధ్య ట్విటర్లో గొడవ జరిగింది. ఈ గార్డెన్‌ను కాంగ్రెస్ ప్రైవేటీకరించడానికి యత్నించిందని, తాము కాపాడి గ్రీనరీని పునరుద్ధరించామని కేటీఆర్ 2011, 2016ల నాటి గూగుల్ ఫొటోలు పెట్టి ట్వీట్ చేశారు. నగరానికి ఊపిరి నింపుతున్న అ గార్డెన్‌ను కాంగ్రెస్ సర్కారు 2011లో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. దీనిపై ఓ కాంగ్రెస్ కార్యకర్త మండిపడ్డారు.‘కేటీఆర్ అబద్ధాల కోరు. బొటానికల్‌ గార్డెన్స్‌లో 2012లో పూలమొక్కలు సహా ఎన్నోరకాల చెట్లు ఉన్నాయి. నేను వాటికి ఫొటోలు కూడా తీశాను’ అని కామెంట్ చేశాడు. 2016లో బొటానికల్‌ గార్డెన్స్‌ చెత్తగా ఉందంటూ ఇంకో ఫొటోను ట్వీటాడు.దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘అయితే గూగుల్‌పై కేసు వేసుకోండి సర్‌. అలాగే, మీ కెమెరా లెన్స్‌ను కూడా మార్చుకోండి. స్కాంగ్రెస్‌ వాళ్లు  నిజాలు ఒప్పుకోలేరు’’ అన్నారు. తర్వాత సదరు కార్యకర్త కేటీఆర్‌కు క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.