KTR condoled the death of Etala Mallaiah
mictv telugu

ఈటలకు కేటీఆర్ ట్వీట్.. థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చిన రాజేందర్

August 24, 2022

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈటలనే స్వయంగా వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలను తన స్వగ్రామం కమలాపూర్‌లో నిర్వహించారు. దీంతో అనేక మంది ఈటలకు పలువురు సంతాపం, సానుభూతి తెలియజేశారు. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. తన సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈటల మల్లయ్య మరణం బాధాకరమని, రాజేందర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ చేసిన వెంటనే ఈటల స్పందిస్తూ థ్యాంక్స్ కేటీఆర్ గారు అంటూ బదులిచ్చారు. కాగా, ఇటీవల కాలం వరకు కేటీఆర్‌ మాదిరి ఈటల రాజేందర్ తెలంగాణ మంత్రిగా కొనసాగారు. కానీ, కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సంతాపం తెలపడం, దానికి రాజేందర్ రిప్లై ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పుకోవచ్చు.