అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్

September 25, 2018

‘ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా మా రాష్ట్రంలో అమలు అవుతున్న ఆరోగ్యశ్రీ పథకమే వందరెట్లు మేలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిని ఆయుష్మాన్‌ భారత్‌ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని సెప్టెంబరు 23న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం గురించి అమిత్ షా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ప్ర‌పంచంలోనే చాలా గొప్ప‌ది. అలాంటి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌రం’ అంటూ ట్వీట్‌లో తెలుగులోనే పేర్కొన్నారు.KTR Counter for Amit Shahఅయితే, ఈ పథకం కంటే తమ రాష్ట్రంలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీనే గొప్పదన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో వివాదం రేగింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అమిత్ షా ట్వీట్‌కు ధీటుగా కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా గారు మీకు తప్పుడు సమాచారం అందింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం వల్ల 80 లక్షల మందికి మేలు జరుగుతోంది. కానీ ఆయుశ్మాన్ భవ పథకం ద్వారా తెలంగాణలో కేవలం 25 లక్షల మందికే లబ్ది చేకూరుతుంది.. గమనించగలరు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో వుంది. తెలంగాణ ఓ రోల్ మోడల్‌గా నిలిచింది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.