చూడ చక్కని రామన్న జంట..నేతన్న నువ్వు గ్రేటన్న.. - MicTv.in - Telugu News
mictv telugu

చూడ చక్కని రామన్న జంట..నేతన్న నువ్వు గ్రేటన్న..

July 7, 2017

కేటీఆర్ దంపతుల ఫోటో ఎంత అద్భుతంగా ఉంది కదా…ఇది ఏ ఆర్టిస్టో వేసిన చిత్రం కాదు..ఏ ఫోటో గ్రాఫరో తీసిన ఫోటో కానే కాదు. అచ్చంగా చేనేత వస్త్రంపై నేతన్న అచ్చేశాడు. దీన్ని నేసిందెవరో తెలుసా సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్.  త‌న నేత ప‌నికి సాంకేతిక‌త‌ను జోడించి అద్భుతాన్ని ఆవిష్క‌రించాడు. డిజిట‌ల్ ప్రింటింగ్‌ను త‌ల‌పించే చేనేత వ‌స్త్రాన్ని త‌యారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు.  కేటీఆర్ దంపతుల ఫోటోను వస్త్రంపై నేసిన విజయ్.. త్వరలోనే వారికి అందివ్వనున్నారు.