KTR criticized Modi
mictv telugu

‘మోదీజీ డబ్బులన్నీ ఆ ఒక్క అకౌంటులోనే వేశారేమో!’

August 31, 2022

KTR criticized Modi

ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీపై ప్రొఫెసర్ నాగేశ్వర్రావు ట్వీట్ చేశారు. ఫిబ్రవరిలో ఆయన ఆస్తుల విలువ రూ. 6.6 లక్షల కోట్లు. కానీ కొన్ని నెలల్లోనే ఆయన సంపద రూ. 10.9 లక్షల కోట్లకి పెరిగింది.

భారత దేశం వృద్ధి చెందలేదని ఎవరు చెప్పారు? అంటూ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ బదులిస్తూ సెటైరికల్‌గా స్పందించారు. ‘ప్రతి భారతీయ పేదవాడికి రూ. 15 లక్షలు అకౌంటులో వేస్తానని మోదీజీ హామీ ఇచ్చారు. పొరపాటున ఆ డబ్బులన్నీ ఒకే అకౌంటులో జమ చేశారేమో. పొరపాటున ఏమైనా తప్పు జరిగిందా మోదీజీ’ అంటూ రిట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కేవలం ఆర్నెల్లలో ఇంత సంపద పెరగడం మనుషులకు సాధ్యం కాదంటున్నారు. కాగా, ఆసియా నుంచి అదానీ ఒక్కరే ఈ రికార్డు సాధించడం గమనార్హం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ లిస్టులో పదో స్థానంలో ఉన్నారు.